- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాడీ పార్ట్స్‌పైనే చర్చ.. టాలెంట్ పట్టించుకోరంటూ నటి సెన్సేషనల్ కామెంట్స్
వలం నా బాడీ షేప్స్ గురించే రచ్చ జరిగేది. అసలు వాళ్లు చెప్పినట్లు నేను ఎందుకు విన్నాను అని ఇప్పుడు అనిపిస్తుంది.

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల రంగు, రూపం విషయంలో ఉండే వివక్షపై నటి సమీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గ్లామర్ ఫీల్డ్‌లో టాలెంట్ కంటే శరీర సౌష్టవానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఆమె తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇండస్ట్రీలో ప్రతిభ కంటే అందానికే ఎక్కువ విలువ ఇస్తారని సమీరా ఆవేదన వ్యక్తం చేశారు. "తెల్లగా ఉండాలనే వ్యామోహం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఒక నటిగా అందంగా కనిపించాలని నేను కోరుకున్నప్పటికీ, నా ముఖానికే కాకుండా శరీర భాగాలకు కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేసేవాళ్లు. బాడీ పార్ట్స్‌కు రంగు పూయడం ఏంటని నాకు చాలా బాధ అనిపించేది. అప్పుడు నిజంగానే నేను అందంగా లేనేమో అని ఆత్మవిశ్వాసం కోల్పోయాను" అని ఆమె పేర్కొన్నారు.
షూటింగ్ సెట్స్‌లో తన నటన గురించి కాకుండా, బాడీ సైజుల గురించే చర్చ జరిగేదని సమీరా షాకింగ్ విషయాలు చెప్పారు. "నేను చాలా పొడవుగా ఉండటంతో నన్ను వయసు పైబడిన దానిలా చూసేవారు. నా యాక్టింగ్ గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. కేవలం నా బాడీ షేప్స్ గురించే రచ్చ జరిగేది. అసలు వాళ్లు చెప్పినట్లు నేను ఎందుకు విన్నాను అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఇండస్ట్రీలో ఉండాలంటే అలా చేయక తప్పదని అప్పుడు అనుకున్నాను" అని తన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పెరిగిన బరువుపై నెటిజన్లు చేసిన విమర్శలు తనను మానసికంగా కృంగదీశాయని సమీరా తెలిపారు. బరువు పెరగడం వల్ల తన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయానని, ఆ సమయంలో ఎదురైన బాడీ షేమింగ్ తనను తీవ్ర వేదనకు గురి చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సమీరా, సోషల్ మీడియా ద్వారా సహజమైన అందం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.






