- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమెను పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన ‘కోర్ట్’ మూవీ డైరెక్టర్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
ఈ ఏడాది నేచురల్ స్టార్ నాని(nani) నిర్మాణంలో వచ్చిన మూవీ ‘కోర్ట్’ (court).

దిశ, సినిమా: ఈ ఏడాది నేచురల్ స్టార్ నాని(nani) నిర్మాణంలో వచ్చిన మూవీ ‘కోర్ట్’ (court). రామ్ జగదీశ్(Ram Jagadish) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీదేవి, హర్ష్ రోషన్ హీరోహీరోయిన్లుగా నటించగా.. ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధికర్, సురభి ప్రభావతి, రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం మార్చి 14న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇందులో నటించిన నటీనటులకు ఫుల్ పాపులారిటీ వచ్చింది.
ఇక ఈ సినిమా వచ్చిన కొద్ది నెలలకే రామ్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టడంతో అంతా షాక్ అవుతున్నారు. తాజాగా, ‘కోర్ట్’ మూవీ డైరెక్టర్ రామ్ వైజాగ్‌లో ఆదివారం రాత్రి కార్తీక అనే అమ్మాయి సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ వేడుకలకు ‘కోర్ట్’ చిత్రం యాక్టర్స్ రోషన్,శ్రీదేవి, శివాజీతో పాటు నిర్మాత ప్రశాంతి కూడా హాజరయ్యారు. అయితే తన పెళ్లి ఫొటోలను రామ్ సోషల్ మీడియాలో షేర్ చేయనప్పటికీ.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వాటిని చూసిన నెటిజన్లు సినీ కెరీర్‌లో సక్సెస్ అయినట్టే పర్సనల్ లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా సంతోషంగా ఉండాలని కోరుతూ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే రామ్ పెళ్లి చేసుకున్నది ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు. పెద్దలు కుదిర్చిన సంబంధం అని తెలుస్తోంది.






