- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగీత్ శోభన్- అనస్వర రాజన్ క్రేజీ కాంబో సెట్ చేసిన ‘కుమారి 21F’ డైరెక్టర్
మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ (Anaswara Rajan)టాలీవుడ్‌లో తన హవా కొనసాగిస్తోంది.

దిశ, సినిమా: మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ (Anaswara Rajan)టాలీవుడ్‌లో తన హవా కొనసాగిస్తోంది. రోషన్ మేక సరసన నటించిన ‘ఛాంపియన్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ, మొదటి ప్రాజెక్ట్ తోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తన సహజ సిద్ధమైన నటనతో, అందంతో కుర్రాళ్ల మనసు దోచుకున్న అనస్వర.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారి వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం.. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సంగీత్ శోభన్ (Sangeet Shobhan)సరసన నటించేందుకు అనస్వర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
‘కుమారి 21F’ వంటి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను అందించిన దర్శకుడు సూర్య ప్రతాప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ గురించి ప్రముఖ మూవీ జర్నలిస్ట్ రాజేష్ మన్నే సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగీత్ శోభన్, ‘ఛాంపియన్’ బ్యూటీ అనస్వర రాజన్‌ల క్రేజీ కాంబినేషన్ బిగ్ స్క్రీన్‌పై ఎలా ఉండబోతుందోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని టాక్.






