- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొప్ప మనసు చాటుకున్న ‘బైసన్’ డైరెక్టర్.. కార్తీకకు భారీ సాయం
కోలీవుడ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ (Mari Selvaraj)ఇటీవల ‘బైసన్’ (Bison)సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ (Mari Selvaraj)ఇటీవల ‘బైసన్’ (Bison)సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ధృవ్ విక్రమ్(Dhruv Vikram), అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలై.. ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మారి సెల్వరాజ్ పేద కుటుంబానికి సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. ఇటీవల భారత్ U-18 కబడ్డీ వైస్-కెప్టెన్ కార్తీకకు రూ. 5 లక్షలు సాయం అందించారు. తమిళపాడుకు కార్తిక బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్‌లో భారత్ తరపున ఆడి స్వర్ణం సాధించింది. అయితే పేదరికంలో ఉన్న కార్తీకకు మారి సెల్వరాజ్ తనవంతు సాయం చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘ఇటీవల బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత U-18 మహిళల కబడ్డీ జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఆడిన కార్తీక, భారతదేశం, తమిళనాడుకు కీర్తిని తెచ్చిపెట్టింది.
ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై విజయంలో కీలక పాత్ర పోషించింది. విజయంలో కీలక పాత్ర పోషించిన కార్తీకకు నా అభినందనలు. ఈ విజయంలో బలమైన శక్తిగా నిలిచిన ఆమె కన్నగి నగర్ కబడ్డీ జట్టు ప్రయత్నాలను అభినందించడానికి నేను ఈరోజు కార్తీక ఇంటికి వెళ్లాను. అదనంగా, వారిని ప్రోత్సహించడానికి, దర్శకుడు పి. ఇరంజిత్ నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, బైసన్ చిత్ర బృందం తరపున కార్తీకకు ₹ 5 లక్షల చెక్కును ఆమె కన్నగి నగర్ కబడ్డీ జట్టుకు ₹ 5 లక్షలను అందజేయడానికి నేను సంతోషిస్తున్నాను..కన్నగి నగర్ కార్తీకాలు తిరుగులేని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా మారి సెల్వరాజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.






