- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ కోసం రంగంలోకి బాలీవుడ్ బ్యూటీని దించుతున్న డైరెక్టర్.. !
అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన అఖిల్ పెద్దగా ఫేమ్ రాబట్టుకోలేకపోయాడు.

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన అఖిల్ పెద్దగా ఫేమ్ రాబట్టుకోలేకపోయాడు. స్టార్ కిడ్ అయినప్పటికీ ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయాయి. ఇక చివరగా అఖిల్ (Akkineni Akhil)నటించిన సినిమా ‘ఏజెంట్’ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆయన రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ప్రజెంట్ ‘లెనిన్’ (Lenin)సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని తాపత్రయ పడుతున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు టాక్. మొదట శ్రీలీలను తీసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల తొలగించారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్యక నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ‘లెనిన్’ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ సినిమాలోని మాస్ డ్యాన్స్ కోసం బాలీవుడ్ బ్యూటీ రంగంలోకి దింపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అత్యంత భారీ స్థాయిలో డిజైన్ చేస్తున్న ఈ పాటలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే(Ananya Panday), అక్కినేని వారసుడితో చిందులేయబోతున్నట్లు టాక్. తన గ్లామర్‌తో, డ్యాన్స్‌తో యువతను ఆకర్షిస్తున్న అనన్య.. ఇందులో స్పెషల్ సాంగ్ చేయడంతో పాటుగా.. చిన్న రోల్ కూడా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న వారు అనన్య పాండే, అఖిల్ కెమిస్ట్రీ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.






