డైరెక్టర్ హిట్ కొట్టగానే డిన్నర్‌కి పిలిచి మనం సినిమా చేద్దామని అనను.. అడివి శేష్ వివాదాస్పద కామెంట్స్!

by Mallepaka Hamsa |

‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న మౌళి (mouli)హీరోగా మారాడు.

డైరెక్టర్ హిట్ కొట్టగానే డిన్నర్‌కి పిలిచి మనం సినిమా చేద్దామని అనను.. అడివి శేష్ వివాదాస్పద కామెంట్స్!
X

దిశ, సినిమా: ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న మౌళి (mouli)హీరోగా మారాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts). సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రశాంత్, రాజీవ్ కనకాల, అనిత్, చౌదరి, సత్య కృష్ణన్, కంచి, జై కృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో మౌళి సరసన శివాని నాగరం హీరోయిన్‌‌గా నటించింది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది.

అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ ప్రేక్షకుల మనసులు దోచేస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా సినీ సెలబ్రిటీలను సైతం మెప్పిస్తోంది. ఈక్రమంలో.. మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న అడివి శేష్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి.

‘‘మా మౌళీకి RTC క్రాస్ రోడ్లో హౌస్ ఫుల్ రికార్డ్ ఉంది. నేను చాలా గర్వంగా చెబుతున్నాను. నువ్వు ఎలా అయితే జనాలను నవ్వించావో.. ఏడిపించావో.. అలా స్టార్స్ లాగా వెళ్లిపోవాలి అనుకుంటున్నాను. నేను ఓపెన్ గా చెప్తున్నా..నా ఇంటర్వ్యూలు అన్నీ చూసుకోండి. ఈ ఏడాదిలో నా ఫేవరేట్ మూవీ ఇదే.

చూసిన హ్యాంగోవర్‌లో చెప్పట్లేదు.. నిజంగా నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో నాకు నచ్చని విషయం ఒకటే.. లిటిల్ హార్ట్స్ అని కాకుండా బిగ్ హార్ట్స్ అనే టైటిల్ పెట్టాల్సింది. అలాగే నేను ఓ ఓక డైరెక్టర్ HIT కొట్టగానే, ఇంటికి డిన్నర్ కి పిలిచి, తర్వాత మనం సినిమా చేయాలి అని ఎప్పుడు అడగను...అలా చెయ్యను’’ అని చెప్పుకొచ్చాడు. అయితే అడివి శేష్ ఈ కామెంట్స్ మెగాస్టార్ చిరంజీవి ఉద్దేశించి అన్నాడని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.

Next Story