- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ యాక్షన్ సీన్స్‌తో అంచనాలను పెంచుతున్న ‘ది డెవిల్’ ట్రైలర్
కన్నడ నటుడు దర్శన్ (Darshan)నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ది డెవిల్’(The Devil).

దిశ, సినిమా: కన్నడ నటుడు దర్శన్ (Darshan)నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ది డెవిల్’(The Devil). ఇందులో రచనా రాయ్ (Rachana Rai)హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ వీర్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీజైమాత కంబైన్స్, వైష్ణో స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ మంజ్రేకర్, అచ్యుత్ కుమార్, షర్మిలా మాండ్రే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 11 విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్‌ను రిలీజ్ చేస్తోంది. తాజాగా, మూవీ మేకర్స్ ‘ది డెవిల్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసి అంచనాలను మరింత పెంచారు. ‘‘రాజు తిరుగులేని పాలనతో.. తుఫాను మొదలవుతుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక విడుదలైన ట్రైలర్‌లో దర్శన్ భారీ యాక్షన్ సీన్స్‌లో కనిపించి అందరిలో ఆసక్తిని రేకెత్తించారు.






