- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గాయపడ్డ సింహం’ గర్జించే తేదీ ఫిక్స్ అయింది.. గ్లోబల్ స్టార్‌తో పోటీకి సిద్ధమైన తరుణ్ భాస్కర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలైన మరుసటి రోజే తరుణ్ భాస్కర్ సినిమా రిలీజ్ కాబోతుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న ఆయన, దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవల హీరోగా వచ్చిన ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ, ఆయన ఏమాత్రం నిరాశ చెందకుండా ‘గాయపడ్డ సింహం’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై ఆసక్తిని పెంచగా, తాజాగా మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. మే 1న ‘గాయపడ్డ సింహం’ థియేటర్లలోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అయితే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలైన మరుసటి రోజే తరుణ్ భాస్కర్ సినిమా రిలీజ్ కాబోతుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక పెద్ద స్టార్ సినిమాతో తరుణ్ భాస్కర్ పోటీ పడుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఈ సినిమా విడుదల తేదీని వెల్లడిస్తూ మూవీ మేకర్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. "గాయపడ్డ సింహం గర్జించే తేదీ ఫిక్స్ అయింది. పూర్తి సరదా, ఉల్లాసం, సంపూర్ణ వినోదం కోసం సిద్ధంగా ఉండండి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఈ సినిమాలో మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ సాధినేని మార్క్ టేకింగ్, తరుణ్ భాస్కర్ నటన తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.






