‘కింగ్‌డమ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తేదీ ఖరారు.. ఫీవర్ పిచ్ వచ్చేస్తోందంటూ మూవీ టీమ్ పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’.

‘కింగ్‌డమ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తేదీ ఖరారు.. ఫీవర్ పిచ్ వచ్చేస్తోందంటూ మూవీ టీమ్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించగా.. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘కింగ్‌డమ్’ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అవగా.. దీనికి సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 31న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారు అయినట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ వేడుకలు యూసఫ్ గూడ పోలిస్ గ్రౌండ్స్‌లో ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు జరగనున్నాయి. ఫీవర్ పిచ్ వచ్చేస్తోంది సిద్ధంగా ఉండండి.. అంటూ బ్యాండ్ ఎమోజీని చిత్రబృందం జత చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న రౌడీ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ ఈవెంట్‌కు వెళ్లే ప్లాన్‌లో పడిపోయారు.

link

Next Story