నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్ట్ ఇస్తూ స్ట్రీమింగ్ డేట్‌‌పై అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) బిచ్చగాడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకునున్నారు.

నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతున్న  క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్ట్ ఇస్తూ  స్ట్రీమింగ్ డేట్‌‌పై అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: కోలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) బిచ్చగాడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకునున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల విజయ్ ఆంటోని క్రైమ్ థ్రిల్లర్ ‘మార్గన్:ది బ్లాక్ డెవిల్’(Morgan: The Black Devil) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లియో జాన్ పాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బ్రిగిదా సగా (Brigida Saga)హీరోయిన్‌గా నటించగా.. వినోద్ సాగర్, సముద్రఖని,మహానంది శంకర్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్స్‌లోకి వచ్చి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

దీంతో నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా, ‘మార్గన్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. కానీ ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ‘టెంట్‌కోట్ట’ సొంతం చేసుకోగా ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ట్విస్ట్ ఏంటంటే.. ‘మార్గన్’ సినిమా తమిళ భాషలో మాత్రమే టెంట్‌కోట్టలో స్ట్రీమింగ్ కానుండగా.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో రాబోతుంది.

link

Next Story