- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న వివాదాస్పద సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
థియేటర్లలో విడుదలైన రెండు నెలలకే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

దిశ, సినిమా: గత ఏడాది సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ది కేరళ స్టోరీ-2’ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై అలరించేందుకు సిద్ధమైంది. అదా శర్మ నటించిన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అదే బాటలో, మళ్ళీ అలాంటి సామాజిక కథాంశంతో తెరకెక్కిన ఈ సీక్వెల్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతోంది. ‘ది కేరళ స్టోరీ-2’ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ తెరకెక్కించగా, ప్రముఖ రచయిత, నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా దీనిని నిర్మించారు. ఈ సీక్వెల్‌లో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. అయినప్పటికీ, ఈ చిత్రం చెప్పాలనుకున్న కథాంశం పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. థియేటర్లలో విడుదలైన రెండు నెలలకే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మే 8వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతుండటం విశేషం. ఈ మూవీ డిజిటల్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ ఒక పవర్‌ఫుల్ క్యాప్షన్‌ను జత చేశారు: "ప్రతి 'పరిపూర్ణ' ప్రేమకథ వెనుక ఒక పథకం ప్రకారం పన్నిన ఉచ్చు దాగి ఉండవచ్చు. దివ్య, నేహా , సురేఖల కలలు ఒక పీడకలగా ఎలా మారాయో ఆ క్షణాన్ని వీక్షించండి" అని రాసుకొచ్చారు. లవ్ జిహాద్ , మతం మార్పిడి వంటి అంశాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం, ముగ్గురు యువతుల జీవితాలు ఎలా తలకిందులయ్యాయనే పాయింట్‌ను ఎమోషనల్‌గా చూపిస్తుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని మే 8 నుంచి జీ5లో ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామానుఎంజాయ్ చేయవచ్చు.






