- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముచ్చటగా మూడోసారి కాంబో రిపీట్.. విశాల్‌తో రొమాన్స్ చేయబోతున్న క్రేజీ బ్యూటీ..?
హీరో విశాల్ రీసెంట్‌గా ‘మదగజరాజా’ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: హీరో విశాల్ రీసెంట్‌గా ‘మదగజరాజా’ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్–కామెడీ ఎంటర్‌టైనర్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్, అంజలి హీరోయిన్లుగా నటించారు. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ సినిమా 2025 సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 12 ఏళ్ల తర్వాత థియేటర్లలో అడుగుపెట్టి ఘన విజయం అందుకుంది.
అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో విశాల్–సుందర్ సి కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా రాబోతోందన్న వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ‘ఆంబల’, ‘మదగజరాజా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన ఈ జోడీ మూడోసారి కలిసి పనిచేయడానికి సిద్ధమవుతోందని సమాచారం. ఈ కొత్త చిత్రంలో సెన్సేషనల్ బ్యూటీ కయాదు లొహర్‌ను ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం దర్శకుడు సుందర్ సి ‘మూక్కుత్తి అమ్మన్–2’ పనుల్లో బిజీగా ఉండగా, విశాల్ ‘మకుటం’ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక కొత్త సినిమాను ప్రారంభించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






