- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్టీలు కొట్టిన ‘ప్రేమలు’ నటుడి కారు.. రక్తపు మడుగులో ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!
‘ప్రేమలు’ సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న నటుడు సంగీత్ ప్రతాప్, అర్జున్ అశోక ఉన్న కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.

దిశ, సినిమా: ‘ప్రేమలు’ సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న నటుడు సంగీత్ ప్రతాప్, అర్జుకన్ అశోకన్ ఉన్న కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి ఓ సినిమా సీన్స్ కొచ్చిలో చేస్తుండగా.. శనివారం నాడు కారు ప్రమాదం జరిగింది. 2 బైకులను ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. కారు తీవ్రంగా ధ్వంసం అవడంతో పాటుగా.. బైక్‌పై ప్రయాణిస్తున్న వారితో పాటుగా ప్రేమలు నటుడికి, అర్జున్‌కు గాయాలు అయినట్లు సమాచారం. ఇదంతా సినిమా షూటింగ్‌లో భాంగా హై స్పీడ్‌తో ఛేజింగ్ సీన్స్ చేస్తుండగా.. ఎంజీ రోడ్డులో కారు ప్రమాదానికి గురైంది.
రక్తం మడుగులో ఉన్న యాక్టర్స్‌ను బైక్ రైడర్‌తో సహా ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు మేకర్స్. ప్రమాదం జరగడంతో సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా అర్జున్ బోస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సంగీత్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.
దీనిని ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆషిక్ నిర్మిస్తుండగా.. మహిమ నంబియార్, కళాభవన్ షాజోన్, బిసు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ సమయంలో యాక్సిడెంట్ కావడంతో అంతా టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు యాక్టర్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. వీరికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. వారు త్వరగా కోలుకుని మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.






