కాళ్లు అక్కడ పెట్టి అర్జున్ రెడ్డి నటితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయి..!

by Disha Web Desk 9 |
కాళ్లు అక్కడ పెట్టి అర్జున్ రెడ్డి నటితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయి..!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో పాపులారిటీ దక్కించుకుంది నటి శ్రీ సుధా. తాజాగా ఈ నటి ప్రయాణిస్తున్న విమానంలో ఆకతాయి నుంచి ఎదురైన చేదు అనుభవం గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. శ్రీసుధా ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో వెనక సీటులో కూర్చున్న ఓ ప్యాసింజర్ పదే పదే తన కాళ్లను గోకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడట.

మూడు సార్లు చెప్పినా కూడా మళ్లీ అలాగే ప్రవర్తించాడంతో దీంతో అక్కడున్న సిబ్బందికి ఫిర్యాదు చేశానని, అయినా కూడా ప్రయోజనం లేకపోవడంతో అతడి కాళ్లపై లాగి పెట్టి గట్టిగా తోక్కెశానని, దెబ్బకి ఆ ఆకతాయి సైలెంట్ అయ్యాడని ఆమె చెప్పుకొచ్చింది. అతడి ఎముకలు విరిగి ఉంటే నాకు సంబంధం లేదు అంటూ శ్రీసుధా కామెంట్ కూడా యాడ్ చేసింది. కాగా ఈ నటి డేర్‌నెస్‌కు జనాలు.. అలాంటి వారికి ఇలాగే బుద్ధి చెప్పాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed