- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా మధ్య ఉన్న బంధం అలాంటిది.. ఎంతో ప్రేమ ఉండేదంటూ తనూజ షాకింగ్ కామెంట్స్
బుల్లితెర నటి తనూజ(Tanuja) ‘ముద్ద మందారం’ సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: బుల్లితెర నటి తనూజ(Tanuja) ‘ముద్ద మందారం’ సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. కన్నడ అమ్మాయి అయినప్పటికీ తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక చాలా రోజుల తర్వాత బిగ్‌బాస్ సీజన్-9లో పాల్గొని మరింత పాపులారిటీ పెంచుకుంది. మొదటి నుంచి ఎక్కువ ఓట్స్ దక్కించుకుంటూ గట్టిపోటీ ఇచ్చింది. అన్ని టాస్కుల్లో బాగా అడటంతో పాటు అందరితో మంచి బాండింగ్‌ను ఏర్పరుచుకుంది. అంతేకాకుండా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఏర్పడటంతో పాటు మా ఇంటి అమ్మాయి అనేలా చేసుకుంది. టాస్ 5 లిస్ట్‌లో నిలవడంతో అంతా ఆమెనే విన్నర్ అవుతుందని భావించారు. కానీ ఊహించని విధంగా.. తనూజ రన్నరప్‌గా నిలిచింది. ఇక ఈ సీజన్-9లో కళ్యాణ్ పడాల (Kalyan Padala)విజేతగా నిలిచాడు.
దీంతో తనూజ కొంత బాధలో ఉన్నప్పటికీ తన బెస్ట్ ఫ్రెండ్ గెలవడంతో సంతోషం వ్యక్తం చేసింది. ఇంటి బయటకొచ్చిన వారంతా తమ పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయారు. ఈక్రమంలో.. తాజాగా, తనూజ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. కళ్యాణ్‌తో ఉన్న బాండింగ్‌ను ఎలాంటిదో చెప్తూ ఎమోషనల్ అయింది. ‘‘నా జీవితంలో నన్ను అంతలా విసిగించి, కోపం తెప్పించే వ్యక్తి అతనొక్కడే. మా మధ్య గొడవలు జరిగినా, అందులో ఎంతో ప్రేమ ఉండేది. తను చాలా కేరింగ్’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక హౌస్‌లో ఉన్నప్పుడు కూడా బిగ్‌బాస్ చూపించిన కొన్ని వీడియోలు వీరిద్దరి ప్రేమ వార్తలకు ఆజ్యం పోసేలా మారాయి. ఇక తనూజ కూడా ఎన్నోసార్లు కళ్యాణ్‌పై ఉన్న ప్రేమను బయటపెట్టడంతో పుకార్లు షికారు చేస్తున్నారు.
Related News : కేసులు వెయ్యడం మాకూడా తెలుసు ఇక పూర్తిగా రంగంలోకి దిగుతా.. అనసూయకు వార్నింగ్ ఇచ్చిన నటి






