ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ నటుడు..

by Mallepaka Hamsa |

‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ (Prashanth Varma)సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ ‘మహాకాళి’.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ నటుడు..
X

దిశ, సినిమా: ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ (Prashanth Varma)సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ ‘మహాకాళి’. ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు (Pooja Aparna Kolluru)దర్శకత్వం వహిస్తుండగా, ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్నారు. దేవత కాళికను కేంద్రంగా చేసుకుని రూపొందుతున్న ఈ కథ శక్తివంతమైనదిగా, సమకాలీన సమాజానికి బలమైన సందేశాన్ని ఇచ్చేలా ఉండబోతోందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళా శక్తిని కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నంగా ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో భూమి శెట్టి ‘మహా’ అనే పాత్రలో, దేవత మహాకాళిగా ప్రేక్షకులను అలరించనుంది.

ఇప్పటివరకు దేవతా పాత్రలను చూపించిన విధానానికి భిన్నంగా, ధైర్యం, ఆగ్రహం, కరుణ అన్ని కలిసిన రూపంలో కాళికను చూపించనున్నారని సమాచారం. ఆమె లుక్‌, క్యారెక్టర్ డిజైన్‌ విషయంలో మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు టాక్. స్మరన్ సాయి సంగీతం అందిస్తుండగా, షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విడుదలవుతున్న ప్రతి అప్‌డేట్ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. ఈ క్రమంలో.. తాజాగా వచ్చిన అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరో స్థాయికి తీసుకెళ్లింది. బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ ఖన్నా(Akshaye Khanna) ఈ చిత్రంలో జాయిన్ అయినట్లు దర్శకురాలు పూజా కొల్లూరు అధికారికంగా ప్రకటించారు. ఆయనతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “కృతజ్ఞతలు 2025! నన్ను నా పరిమితులకు మించి కష్టపడేలా చేసి, కొత్తగా నన్ను నాకు పరిచయం చేశావు” అంటూ ఎమోషనల్ క్యాప్షన్ జత చేశారు.

అయితే అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించనున్నారన్నది మాత్రం పూర్తిగా సస్పెన్స్‌గా ఉంచారు. ఇప్పటికే ‘మహాకాళి’పై అంచనాలు భారీగా ఉండగా, అక్షయ్ ఖన్నా ఎంట్రీతో అవి రెట్టింపయ్యాయి. ముఖ్యంగా ఆయన పాత్ర పాజిటివ్‌నా? నెగటివ్‌నా? లేక గ్రే షేడ్‌లోనా? అన్న చర్చలు మొదలయ్యాయి. మరోవైపు అక్షయ్ ఖన్నా ఇటీవల రణ్‌వీర్ సింగ్- ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్’తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అలాంటి నటుడు ‘మహాకాళి’ లాంటి మిథలాజికల్ సోషల్ యాక్షన్ డ్రామాలో కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది.

Next Story