- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్‌తో బోల్డ్ బ్యూటీ డేటింగ్ .. అతనితో దర్శనమిచ్చేసరికి అంతా షాక్
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi) స్పెషల్ సాంగ్స్‌తోనే కాదు, నటిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi) స్పెషల్ సాంగ్స్‌తోనే కాదు, నటిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, హిందీ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూ తన అందం, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. ఇటీవల ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నోరా, ఆ విజయం తర్వాత వరుస అవకాశాలతో బిజీగా మారింది. ఐటమ్ సాంగ్స్‌తో పాటు నటిగా కూడా రాణిస్తూ చేతినిండా సంపాదిస్తోంది. సినిమాలే కాదు, సోషల్ మీడియాలోనూ నోరా ఫతేహి ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నోరా తన ప్రియుడితో కలిసి ఉన్నట్లు కనిపించే కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం సంచలనంగా మారింది.
ఇటీవల AFCON మ్యాచ్‌ను వీక్షించేందుకు మొరాకో వెళ్లిన నోరా, అక్కడి జెర్సీ ధరించి సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మొరాకన్ స్టార్ ఫుట్‌బాలర్ అచ్రఫ్ హకిమి(Achraf Hakimi)తో కలిసి కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు, నోరా పోస్ట్‌కు అచ్రఫ్ లైక్ చేయడం కూడా గమనార్హంగా మారింది. ఈ ఫొటోలు బయటకు రావడంతో నోరా- అచ్రఫ్ డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు ఊపందుకున్నాయి. ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం, పైగా అచ్రఫ్ లైక్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారగా, నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ స్పందిస్తున్నారు. కొందరు ఇది స్నేహమే అంటుంటే, మరికొందరు మాత్రం ప్రేమ కథ మొదలైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.






