రెండో పెళ్లి చేసుకోబోతున్న బోల్డ్ బ్యూటీ.. రిలేషన్‌షిప్‌పై అధికారిక ప్రకటన చేసి బిగ్ షాకిచ్చిందిగా!

by Mallepaka Hamsa |

ఇటీవల కాలంలో చాలా మంది పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటూ విడాకులు తీసుకుంటున్నారు.

రెండో పెళ్లి చేసుకోబోతున్న బోల్డ్ బ్యూటీ.. రిలేషన్‌షిప్‌పై అధికారిక ప్రకటన చేసి బిగ్ షాకిచ్చిందిగా!
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటూ విడాకులు తీసుకుంటున్నారు. చిన్న చిన్న గొడవలకే విడిపోతూ.. ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నారు. ఆ తర్వాత రెండో పెళ్లిళ్లు చేసుకుంటూ లైఫ్‌ని అక్కడితే ఆపేయకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలామంది సినీ సెలబ్రిటీలు. ఇక ఇప్పుడు ఓ బోల్డ్ బ్యూటీ కూడా ఇదే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోందిజ బాలీవుడ్ నటి కీర్తి కుల్హారి(Kirti Kulhari) మొదటి భర్తతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సాహిల్ సెహగల్‌(Sahil Sehgal)ను పెళ్లి చేసుకున్న ఆమె ఐదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికింది. 2021లో భర్తతో విడాకులు తీసుకుంది. ఇక అప్పటినుంచి నటుడు రాజీవ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా, ఈ విషయంపై కీర్తి కుల్హారి స్పందించి అధికారిక ప్రకటనతో పుకార్లకు చెక్ పెట్టింది.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన ప్రియుడు రాజీవ్‌(Rajiv)తో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంది. కారులో తీసుకున్న సెల్ఫీలు, కలిసి చేసిన ప్రయాణాలు, లిఫ్టులో దిగిన క్యూట్ ఫొటోలతో పాటు రాజీవ్ నుదుటిపై ముద్దు పెట్టింది.ఈ వీడియో చివరలో కిటికీపై బాణం గుర్తుతో ఉన్న హార్ట్ సింబల్‌ను చూపిస్తూ తన ప్రేమను అందరికీ తెలిసేలా చేసింది. ‘‘ఒక చిత్రం వెయ్యి మాటల కంటే గొప్పది’’ అనే క్యాప్షన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వెంటనే వారి సహనటులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం షాక్ అవుతున్నారు. కాగా.. రాజీవ్, కీర్తి ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!’ అనే వెబ్‌సిరీస్‌లో జోడీగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇందులో అంజనా, మిహిర్ పాత్రలో కనిపించగా.. ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. అంతేకాకుండా వీరికి పాపులారిటీ పరంగా ప్లస్ అయింది. ఇక ఈ సిరీస్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీరిద్దరు తమ రిలేషన్‌ను సీక్రెట్‌గా మెయిన్‌టేన్ చేస్తున్నట్లు టాక్.

Next Story