- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్ బ్యూటీ చుట్టూ 150 మంది బాడీ గార్డ్స్.. షాక్‌లో నెటిజన్లు!
సాధారణంగా సెలబ్రిటీలు తమ భద్రత కోసం కొంతమంది బాడీగార్డ్స్‌ను నియమించుకుంటారు.

దిశ, సినిమా: సాధారణంగా సెలబ్రిటీలు తమ భద్రత కోసం కొంతమంది బాడీగార్డ్స్‌ను నియమించుకుంటారు. ముఖ్యంగా జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు, అభిమానులు చుట్టుముట్టే సందర్భాల్లో భద్రతా సిబ్బంది వారి వెంట ఉంటారు. సినిమా ఈవెంట్లు, ఆడియో లాంచ్‌లు, షోస్, పబ్లిక్ ఫంక్షన్ల సమయంలో సాధారణంగా నలుగురు లేదా ఐదుగురు బాడీగార్డ్స్ ఉంటే చాలు అనే స్థాయిలో ఏర్పాట్లు ఉంటాయి. కానీ తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ విషయంలో మాత్రం ఈ సంఖ్య ఏకంగా 150 వరకు వెళ్లిందంటూ వార్తలు వైరల్‌గా మారాయి. బిగ్‌బాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న తాన్య మిట్టల్ (Tanya Mittal)చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారితీశాయి. ముఖ్యంగా “నాకు 150 మంది బాడీగార్డ్స్ ఉన్నారు” అనడంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. పూటకో చీర కడతానని, లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి ఆమె మాట్లాడిన క్లిప్స్ కూడా వైరల్ అవడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా, తాన్య మిట్టల్ ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. “నేను 150 మంది నా కింద పనిచేస్తారని మాత్రమే చెప్పాను. అంతే తప్ప, వాళ్లంతా నా బాడీగార్డ్స్ అని నేను ఎక్కడా చెప్పలేదు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో సహ పోటీదారుడైన జైషా ఖాద్రి సరదాగా వాళ్లందరినీ నా బాడీగార్డ్స్ అని అన్నాడు. అదే ఇప్పుడు నిజంలా మారిపోయింది. నా వ్యక్తిగతంగా కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఉన్నారు. వాళ్లు నా వ్యాపార అవసరాల కోసమే. నాకు ఫార్మా ఫ్యాక్టరీ, గిఫ్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, వస్త్ర పరిశ్రమ వంటి వ్యాపారాలు ఉన్నాయి. వాటి నిర్వహణ కోసం భద్రతా సిబ్బంది అవసరమవుతారు. కానీ వాటిని “150 మంది బాడీగార్డ్స్”గా చూపించడం పూర్తిగా తప్పుడు ప్రచారం. నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి తప్పుడు కథనాలు రాయొద్దు’’ అంటూ ఆమె మీడియా, సోషల్ మీడియా యూజర్లను కోరింది. మొత్తానికి, బిగ్‌బాస్ తర్వాత కూడా తాన్య మిట్టల్ పేరు వార్తల్లో నిలవడం గమనార్హం.






