- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్టప్ ప్రపంచంలో గెలుపు కోసం పోరాటం.. ‘రఫ్తార్’ అప్డేట్‌తో అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన కీర్తి!
ఒక పవర్‌ఫుల్ మ్యాన్, సమానమైన ఆశయాలున్న ఒక మహిళ మధ్య ఉండే క్లిష్టమైన సంబంధాన్ని ఇందులో చూపించబోతున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తీ సురేష్, ఇప్పుడు రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘రఫ్తార్’ (Raftaar) లో మెరవబోతోంది. ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజ్‌కుమార్ రావు సతీమణి పత్రలేఖ తన సొంత బ్యానర్ 'కాంపా ఫిలిం'పై నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించారు. ఈ భారీ చిత్రం 2026, జూలై 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా కీర్తీ సురేష్ తన సోషల్ మీడియాలో చిత్ర పోస్టర్‌ను షేర్ చేస్తూ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.
"ఆశయం దీనిని నిర్మించింది.. అత్యాశ దీనిని పరీక్షిస్తుంది. జూలై 24న మీ దగ్గరలోని థియేటర్లలోకి ‘రఫ్తార్’ రాబోతుంది సిద్ధంగా ఉండండి" అనే క్యాప్షన్ జత చేసింది. రాజ్‌కుమార్ రావు కూడా తన హోమ్ బ్యానర్ నుంచి వస్తున్న మొదటి థియేట్రికల్ మూవీ కావడంతో చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు తెలిపారు. ‘రఫ్తార్’ సినిమా ఒక హై-స్టేక్స్ స్టార్టప్ ప్రపంచం నేపథ్యంలో సాగుతుంది. ఒక పవర్‌ఫుల్ మ్యాన్, సమానమైన ఆశయాలున్న ఒక మహిళ మధ్య ఉండే క్లిష్టమైన సంబంధాన్ని ఇందులో చూపించబోతున్నారు. స్టార్టప్ ప్రపంచంలో గెలుపు కోసం పాకులాడే ఒక ధైర్యవంతురాలైన మహిళగా కీర్తీ సురేష్.. ఇందులో తన విశ్వరూపం చూపించబోతోంది.
డబ్బు, అధికారం, గెలుపు కోసం సాగే పరుగులో వారి మధ్య ఉన్న ప్రేమ ఎలా దెబ్బతింటుంది? పతనం తర్వాత వారు మళ్ళీ ఎలా పైకి లేస్తారు? అనే అంశాలను ఆసక్తికరంగా మలిచారు. విద్య అంటే జ్ఞానాన్ని పంచడం, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే ఉద్దేశం పక్కన పెట్టి, కేవలం బిజినెస్, ప్రాఫిట్స్ కోసమే విద్యాసంస్థలు ఎలా పాకులాడుతున్నాయో ఈ సినిమాలో హాస్యాస్పదంగా చూపించబోతున్నారట. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు, కీర్తీ సురేష్‌తో పాటు అనురాగ్ ఠాకూర్, రోహన్ వర్మ, తాన్యా మణిక్తల, రజత్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జూలై 24న విడుదల కానున్న ఈ సినిమాతో కీర్తీ బాలీవుడ్‌లో గట్టి ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది.






