బయ్యర్లకు లాభాలు కురిపిస్తోన్న ‘Baby’.. దిమ్మ తిరిగే కలెక్షన్లతో రికార్డులు

by Disha Web Desk 7 |
బయ్యర్లకు లాభాలు కురిపిస్తోన్న ‘Baby’.. దిమ్మ తిరిగే కలెక్షన్లతో రికార్డులు
X

దిశ, వెబ్‌డెస్క్ : సినిమా బావుంటే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకి రెడ్ కార్పెట్ వేస్తారని మరోసారి రుజువైంది. రీసెంట్‌గా విడుదలైన బేబీ సినిమే ఇందుకు సాక్ష్యం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ సినిమాని సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీకి అద్భుతమైన మ్యూజిక్‌కు అందించడంతో రిలీజ్‌కు ముందు నుంచే మంచి బజ్ ఏర్పడింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా కాస్త గట్టిగానే చేశారు మేకర్స్.

అయితే బేబీ చిన్న సినిమాగా వచ్చి చాలా పెద్ద విజయం సాధించిందనే చెప్పాలి. రిలీజ్ అయిన ఒక్కరోజే వరల్డ్ వైడ్ గా రూ.7 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. రెండో రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా మొత్తంగా రూ.14.2 కోట్లను వసూలు చేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇక రిలీజ్ అయిన తర్వాత రెండు రోజు రోజులు వీకెండ్స్ కావడంతో బేబీ థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇక మొత్తం మూడురోజులకు కలుపుకొని ఏకంగా రూ.23.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి చరిత్ర సృష్టించింది ఈ మూవీ.

ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో ముందుకెళ్తుంది. ఇప్పుడున్న ట్రెండ్‌ని ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్‌కు బాగా కనెక్ట్ అయిందనే చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సీన్‌ని కనెక్ట్ చేసేలా డైరెక్ట్ చేశారు సాయి రాజేష్. కేవలం ఒక్కరోజులోనే పెట్టిన బడ్జెట్ మొత్తాన్ని వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కల్ట్ క్లాసిక్ సినిమాగా పేరు తెచ్చికొని సూపర్ హిట్‌గా నిలిచి ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ బయ్యర్లకు భారీ లాభాలను తెస్తుంది. మొత్తంగా ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.



Next Story

Most Viewed