అవంటే నాకు చచ్చేంత పిచ్చి.. ఆసక్తికర విషయాలు చెప్పిన బేబీ హీరోయిన్

by Hamsa |
అవంటే నాకు చచ్చేంత పిచ్చి.. ఆసక్తికర విషయాలు చెప్పిన బేబీ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెబ్‌సిరీస్‌లతో స్క్రీన్‌పై కనిపించింది. ఇటీవల ‘బేబీ’ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. బేబీ చిన్న మూవీగా వచ్చి భారీ విజయాన్ని అందుకోవడంతో అందరి దృష్టి వైష్ణవి చైతన్యపై పడింది. ఇక ప్రస్తుతం చేతిలో రెండు లతో బిజీగా ఉన్న వైష్ణవి కెరీర్‌పై దృష్టిసారించింది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘‘హాఫ్‌ శారీస్‌ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నా ట్రెడిషనల్‌గా హాఫ్‌ శారీలు లేదా చీరలు ధరిస్తాను. అవంటే నాకు చచ్చేంత పిచ్చి. జీన్స్‌ వేసుకోవడం చాలా తక్కువ ఒకవేళ ఎప్పుడైనా జీన్స్‌ వేసుకున్నా బొట్టు పెట్టుకోవడం మాత్రం మరువను. ఈ ఏడాది వినాయక చవితి నాకు ఎంతో ప్రత్యేకమైనది. బేబీ విజయవంతం కావడంతో ఎంతో మంది నుంచి అభినందనలు వచ్చాయి. మేము ఇంకా అదే సంతోషంలోనే ఉన్నాం, కాబట్టి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం’’ అంటూ చెప్పుకొచ్చింది. బేబీలో అంత బోల్డ్‌గా నటించిన వైష్ణవి సంప్రదాయ దుస్తుల గురించి ఇలా చెప్పడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Read more : Actress Photo Gallery



Next Story

Most Viewed