- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పెషల్ డే నాడే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి.. మా జీవితాల్లో అద్భుతం జరిగిందంటూ పోస్ట్
బుల్లితెర నటి చైత్రరాయ్(Chaitra Rai) అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్‌లు చెప్పింది.

దిశ, సినిమా: బుల్లితెర నటి చైత్రరాయ్(Chaitra Rai) అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్‌లు చెప్పింది. తొమ్మిదో పెళ్లి రోజు నాడే తమకు పండంటి బిడ్డ పుట్టినట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ఇది వరకే ఓ పాప ఉండగా.. ఇప్పుడు మరోసారి కూతురు పుట్టినట్లు తెలిపింది. తమ కుటుంబంలో మరో మెంబర్ జాయిన్ అయినట్లు నలుగురి చేతుల ఫొటోను షేర్ చేసింది. ‘‘మా జీవితాల్లో ఓ అద్భుతం జరిగింది. మాకు రెండోసారి దేవుడి ఆశీస్సులు లభించాయి. మా కుటుంబంలోకి మరో చిన్ని యువరాణి అడుగుపెట్టింది. మా పెళ్లయి తొమ్మిదేళ్లవుతోంది.
మా ఆయన ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా. మేమిద్దరం ఇప్పుడు నలుగురమయ్యాం. ఈ పెళ్లిరోజుతో మా కుటుంబం పరిపూర్ణమైంది’’ అని రాసుకొచ్చింది. కాగా.. చైత్ర రాయ్..అష్టాచమ్మా సీరియల్‌తో ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. దట్ ఈజ్ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, అత్తో అత్తమ్మ కూతురో వంటి సీరియల్స్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీలోనూ యాక్ట్ చేసింది. సీరియల్స్, ఈవెంట్స్ అంటూ కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. ప్రసన్న శెట్టి(Prasanna Shetty)ని పెళ్లి చేసుకుంది. వీరికి 2021లో కూతురు పుట్టగా.. ఇప్పుడు మరోసారి ఆడబిడ్డ పుట్టింది.






