‘ది రాజాసాబ్’ సినిమా కోసం ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Mallepaka Hamsa |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)నటించిన లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab).

‘ది రాజాసాబ్’ సినిమా కోసం ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)నటించిన లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajassab). మారుతి (maruthi)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియాలో ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించగా.. ఇందులో సంజయ్ దత్, యోగిబాబు కీలక పాత్రలో కనిపించారు. ఇక హారర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో మాళవిక మోహనన్,రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ‘ది రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య జనవరి 9 థియేటర్స్‌లోకి వచ్చి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పలు సీన్స్ తొలగించడం వల్ల అభిమానులు కూడా ఫుల్ ఫైర్ అయ్యారు. దీంతో ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్స్‌తో పాటు మొత్తం 8 నిమిషాల కంటెంట్‌ను యాడ్ చేశారు. దీంతో ‘ది రాజాసాబ్’ ప్రేక్షకులను బాగానే మెప్పిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ ఈ చిత్రానికి ఏకంగా రూ.100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఆయన తాత పాత్రలో నటించిన సంజయ్ దత్‌కు రూ.5–6 కోట్లు చెల్లించారట. హీరోయిన్లలో రిద్ధి కుమార్ రూ.3 కోట్లు, మాళవిక మోహనన్ రూ.2 కోట్లు, నిధి అగర్వాల్ రూ.1.5 కోట్లు పారితోషికంగా అందుకున్నారని టాక్. అనుపమ్ కేర్‌కు రూ.1 కోటి, దర్శకుడు మారుతికి రూ.18 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా, ఈ సినిమాలో అత్యల్ప రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు బ్రహ్మానందం కాగా, ఆయనకు కేవలం రూ.80 లక్షలు మాత్రమే చెల్లించారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి, ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ‘ది రాజాసాబ్’ నిర్మాతలు కొంత నిరాశలో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Next Story