ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం.. హైప్ పెంచేస్తున్న ఉపేంద్ర కామెంట్స్

by Mallepaka Hamsa |

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka)సినిమాలో కీలక పాత్రలో నటించిన ఉపేంద్ర లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం.. హైప్ పెంచేస్తున్న ఉపేంద్ర కామెంట్స్
X

దిశ, సినిమా: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka)సినిమాలో కీలక పాత్రలో నటించిన ఉపేంద్ర లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. స్టొరీ చెప్పగానే ఫ్యాన్స్ కి కనెక్ట్ అయిపోయాను. ఇందులో చాలా అద్భుతమైన ఎమోషన్ ఉంది. అందరి జీవితంలో ఇలాంటి ఎమోషన్ ఉంటుంది అందుకే నాకు చాలా కనెక్ట్ అయ్యింది. అసలు అభిమానులు ప్రేమకు లాజిక్ ఉండదు. ఎందుకు ఇంతగా ప్రేమిస్తారు? దానికి మనం అర్హులమేనా? అనిపిపిస్తుంటుంది. సాధారణంగా ఒక స్టార్ జీవితం ఎలా ఉంటుందో సూర్య పాత్ర అలానే ఉంటుంది. ఫ్యాన్స్ క్రేజ్, అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. హ్యూమన్ ఎమోషన్స్, ప్రేమ, రిచ్ పూర్‌కి మధ్య ఉండే ఒక సంఘర్షణ ఎలివేషన్స్ అన్ని కమర్షియల్ యాంగిల్‌లో చేసిన సినిమా ఇది.

ఒక స్టార్‌కి అభిమానికి మధ్య ఉండే ఎమోషన్‌ని చాలా అద్భుతంగా చెప్పారు. అది చాలా కొత్తగా అనిపిస్తుంది. రామ్ పోతినేని (Ram Pothineni)ఎక్స్ట్రార్డినరీ ఎనర్జిటిక్ పెర్ఫార్మర్. ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ఆయన యాక్షన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఒక స్టార్ అయి ఉండి అలా నటించడం అంత ఈజీ కాదు. అయితే నేను గత కొద్ది రోజులుగా చిరంజీవి గారితో సినిమా చేయాలని అనుకుంటున్నా నా డైరెక్షన్ రాబోతుంది. నాకు అదొక పెద్ద డ్రీమ్. అన్ని కుదిరితే డెఫినెట్‌గా చేస్తాను’’ అని చెప్పుకొచ్చారు.ఈ కామెంట్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

Next Story