- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
20 ఏళ్లు కూడా నిండని హీరోయిన్‌తో 71 ఏళ్ల నటుడు అసభ్యకర ప్రవర్తన.. అక్కడ ముద్దు పెట్టిన వీడియో వైరల్!
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అర్జున్(Sara Arjun) చైల్డ్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అర్జున్(Sara Arjun) చైల్డ్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మరీ ముఖ్యంగా చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ‘నాన్న’మూవీతో సారా ఫేమ్ మరింత పెరిగింది. ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో పాటు అమ్మడు నటనకు ప్రశంసలు దక్కాయి. సారా అర్జున్ హీరోయిన్‌గా నటించిన మొదటి మూవీ ‘ధురంధర్’. ఈ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈక్రమంలోనే.. సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న నటుడు రాకేష్ బేడీ(Rakesh Bedi), సారా అర్జున్‌ను గట్టిగా హగ్ చేసుకుని ముద్దుపెట్టాడు. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. యువతిపై వృద్ధుడి ప్రేమ అని వార్తలు వైరల్ అవుతున్నాయి.
అంతేకాకుండా రాకేష్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కూతురి లాంటి వయసున్న అమ్మాయికి స్టేజ్‌పై ముద్దు పెట్టడం ఏంటనీ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. 20 ఏళ్లు కూడా నిండని సారాకు 71 ఏళ్ల రాకేష్ ముద్దు పెట్టడంతో ఈ సంఘటన వివాదాస్పదంగా మారింది. ఈక్రమంలో.. తాజాగా, ‘ధురంధర్’లో సారాకు తండ్రిగా నటించిన రాకేష్ ఆమెకు ముద్దు పెట్టిన వివాదంపై ఆయన స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకేష్ అసలు విషయం చెప్పాడు. గత కొద్ది రోజులుగా యువతిపై వృద్ధుడి ప్రేమ అనే వార్తలు రాస్తున్నారు. కానీ నేను తప్పుడు ఉద్దేశంతో సారాను దగ్గరకు తీసుకోలేదు. తండ్రిలా దగ్గరకు తీసుకున్నాను. ఆమె నాకంటే చాలా చిన్నది. షూటింగ్ సమయలోనూ మేమిద్దరం సొంత కుటుంబంలానే ఉన్నాం. ప్రతి విషయాన్ని ఆమె నాతో పంచుకునేది.
తెరపై కూడా మా అనుబంధం కనిపించింది. అందుకే అలా చేశాను. కానీ అందరూ దానిని తప్పుగా చూస్తున్నారు. తండ్రికి, కుమార్తెపై ఉన్న ప్రేమలా ఎవరూ చూడటం లేదు. వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. కానీ సారాపై తప్పుడు ఉద్దేశం అయితే లేదు.. తను నా కూతురులాంటిది’’ అని చెప్పుకొచ్చారు. దీంతో వివాదానికి చెక్ పడినట్లు అయింది. కాగా..రణ్‌వీర్ సింగ్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లు వసూలు చేసింది. భారత్‌లో మాత్రం రూ. 400 కోట్లు సాధించినట్లు సమాచారం. ఇక ఇందులో సారా అర్జున్, రాకేష్ బేడీ తండ్రి కూతురిలా నటించారు.






