అందుకే విడిపోయాం.. విడాకులపై నిజం చెప్పిన మోటివేటర్ వంశీ (వీడియో)

by Disha Web Desk 8 |
అందుకే విడిపోయాం.. విడాకులపై నిజం చెప్పిన మోటివేటర్ వంశీ (వీడియో)
X

దిశ సినిమా : సోషల్ మీడియా జనాలకు పరిచయం అవసరం లేని పేరు మోటివేటర్ వంశీ. ఈయన యూట్యూబ్‌లో మోటివేషనల్ వీడియోస్‌తో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. వంశీ వీడియోస్‌‌ను లక్షల మంది ఫాలో అవుతుంటారు. అయితే ఈయన త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.కానీ వీటిని కొందరు కొట్టిపారేశారు , కానీ చివరికి ఆ వార్తలే నిజమయ్యాయి. జనవరి17న తాను తన భార్యతో, పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. విడాకుల గురించి మాట్లాడుతూ..మేము హ్యాప్పీగానే విడిపోదాం అనుకున్నాం. అలానే విడిపోయాం. సంతోషంగా ఉన్నప్పుడు కలిసి ఉన్నాం.హ్యాప్పీగా లేము అనుకున్నప్పుడు ఇక కలిసి ఉడటం అనేది రాంగ్ లైఫ్ స్టైల్ అవుద్దీ.నిజానికి నేను పబ్లిక్‌కు చెప్పినప్పుడు అడ్జెస్ట్ అవ్వండి , సారీ చెప్పుండి, కలిసి పోండి అని చెప్తాను కానీ, సంతోషంగా లేనప్పుడు కలిసిఉండకూడదు. దీని వలన ఎదుటి వారు కూడా బాధపడుతారు, వారి లైఫ్ కూడా బాగుండాలి కధా.. అందుకే హ్యాప్పీగా విడిపోదాం అనుకున్నాం, విడిపోయాం అంటూ మొదటిసారి విడాకుల ఇష్యూపై నోరు విప్పారు.

Next Story

Most Viewed