- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay Devarakonda : ఆ కారణంగానే OTT లో సినిమాలు, Web Series లు చేయనంటోన్న..
ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వశక్తితో సినిమా ప్రపంచంలో ఎదిగిన విజయ్ దేవరకొండ

దిశ, సినిమా: ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వశక్తితో సినిమా ప్రపంచంలో ఎదిగిన విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ‘ఖుషి’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించగా, సెప్టెంబర్ 1న తెలుగుతో సహా ఏకంగా 5 భాషల్లో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వెబ్ సిరీస్‌ల గురించి ఓపెన్‌గా మాట్లాడాడు విజయ్. ‘నేను వెబ్ సిరీస్‌లు చేయను, నేననే కాదు తెలుగు ఇండస్ట్రీలోని చాలా మంది పెద్ద నటులు వెబ్ సిరీస్ ఫార్మాట్‌లో పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదు. OTT ప్లాట్‌ఫామ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూసి ఆనందిస్తాను కానీ నాకు భారీ 70ఎంఎం స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించడమే ఇష్టం’ అని తెలిపాడు.
ఇవి కూడా చదవండి : ఆ మాట నా హృదయాన్ని కలిచివేసింది.. బీఆర్ఎస్ ఎంపీపై రామ్ చరణ్ ప్రశంసలు






