ఆ కారణంతోనే తమిళ సినిమాలు రూ. 1000 కోట్లు రాబట్టలేకపోతున్నాయ్.. శివ కార్తికేయన్ సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-09 07:09:21  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) ఇటీవల ‘మదరాసి’(madharaasi) మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

ఆ కారణంతోనే తమిళ సినిమాలు రూ. 1000 కోట్లు రాబట్టలేకపోతున్నాయ్.. శివ కార్తికేయన్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) ఇటీవల ‘మదరాసి’(madharaasi) మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివకార్తికేయన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘తమిళ సినిమాలు ఆ నంబర్‌కి చేరువలోకి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మరికొన్నేళ్లలో రూ. 1000 కోట్లు కలెక్షన్లు సాధిస్తాయని నమ్ముతున్నాను. చాలా తమిళ చిత్రాలు ఈ మార్క్‌ని అందుకోలేకపోతున్నాయి. స్టోరీలో నాణ్యత లేకపోవడమో లేదా పాన్ ఇండియా సబ్జెక్ట్ కాకపోవడం వల్లనో దీనికి కారణం అనిపిస్తుంది.

మూవీ క్వాలిటీ సంగతి పక్కనపెడితే టికెట్ రేట్లు కూడా తమిళనాడులో చాలా తక్కువగా ఉంటాయి. బెంగళూరు ముంబైలో ఉన్నట్లు ఇక్కడ ఉంటే ‘జైలర్‌’(Jailer)కు 800-1000కోట్లు వచ్చి ఉండేవి. అలా అని టికెర్ట్ రేట్లు పెంచమని నా ఉద్దేశం కాదు. మా సినిమాలు ఉత్తరాది ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాల్సిన అవసరముందని నా అభిప్రాయం’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. శివకార్తికేయన్‌కు కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇండరెక్ట్‌గా తెలుగు ఇండస్ట్రీ గురించే మాట్లాడాడని అంటున్నారు.

Read More..

ధనుష్ ‘ఇడ్లీ కడై’ ఆడియో లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. మూవీ మేకర్స్ పోస్ట్ వైరల్

Next Story