సాయి పల్లవి మేకప్ వేసుకోకపోవడానికి కారణం ఇదే..

by Disha Web Desk 7 |
సాయి పల్లవి మేకప్ వేసుకోకపోవడానికి కారణం ఇదే..
X

దిశ, సినిమా: టాలీవుడ్ నేచురల్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ అమ్మాయి అయినప్పటికీ.. మనవాళ్ళు బాగా ఓన్ చేసుకున్నారు. మిగతా హీరోయిన్‌లతో పోలిస్తే ఆమె పూర్తి భిన్నంగా ఉంటుంది. తను ధరించే దుస్తులు కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇక మేకప్ విషయానికి వస్తే ఆఫ్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆన్ స్క్రీన్‌పై కూడా ఆమె మేకప్ వేసుకోదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి తాను మేకప్ వేసుకోకపోవడానికి కారణం ఏంటో చెప్పింది. ‘నా వాయిస్‌ బాగోదు, మొహంపై మొటిమలు ఉన్నాయి అని నేను చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందిగా ఫీల్‌ అయ్యేదాన్ని.

ఈ రెండు విషయాలు నన్ను చాలా భయపెట్టేవి. కానీ అలా అని ఎప్పడు నేను మేకప్ వేయలేదు. నా ఫస్ట్ మూవీ ‘ప్రేమమ్‌’లో కూడా మేకప్‌ లేకుండా నటించా. ఆడియన్స్ ఎలా తీసుకుంటారోనని చాలా భయపడ్డాను. కానీ మంచి స్పందన వచ్చింది. అప్పటి నుంచి నేను, మూవీస్‌లో మేకప్‌ లేకుండానే నటించాలని నిర్ణయించుకున్నా. దర్శకులెవరూ మేకప్ వేసుకోవాలని ఇబ్బంది పెట్టలేదు. ‘విరాట పర్వం’ మూవీలో నా ముఖం ఏడ్చినప్పుడు రెడ్‌గా మారింది. ఆ లుక్ బాగుందని అలాగే నటించమన్నారు. గ్లిజరిన్ కూడా చాలా తక్కువ వాడతాను’ అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

Also Read..

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ మళ్లీ ప్రెగ్నెంట్ అయిందా?

Next Story

Most Viewed