- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుకే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకుండా ఆగిపోతున్నాయి.. సెన్సార్ బోర్డ్‌పై డైరెక్టర్ ఫైర్
సెన్సార్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై సినీ సెలబ్రిటీలు విమర్శలు గుప్పిస్తున్నారు.

దిశ, సినిమా: సెన్సార్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై సినీ సెలబ్రిటీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇటీవల ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ మూవీ విషయంలో పేరు మార్చాలని సెన్సార్ బోర్డ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కథలు రాసేటప్పుడు పాత్రలకు పురాణాల్లోని పేర్లు ఉపయోగించవద్దనడం విచిత్రంగా ఉంది. దీని గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే బతికున్న వ్యక్తుల పేర్లను పాత్రలకు ఎలాగో పెట్టలేము.
ఇంకా అక్కడ ఏమి మిగిలి ఉంది. మన పాత్రలను XYZ, 123, ABC అని పిలవాలా? పాత్రలకు ఇంటిపేర్లు, డార్క్ షేడ్స్, నెగిటివ్ షేడ్స్ ఉన్న కూడా సమస్యే. ఇలాంటి సమస్యల కారణంగానే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకుండా ఆగిపోతున్నాయి. కొంతమంది క్రియేటివిటీకి సెన్సార్ బోర్డు సంకెళ్లు వేస్తోంది. నైతిక పాఠాలు నేర్పడానికి రూపొందించిన సినిమాలు నిజంగా సమాజాన్ని మార్చలేవు. నిజాయితీగా కథ చెప్పడం చాలా ముఖ్యం. ప్రస్తుతం అలాంటి సినిమాలు రావట్లేదు. నా మొదటి మూవీలోని ‘సత్య’ అనే పదానికి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు నేను డిక్షనరీ తీసుకెళ్లి ఆ పదానికి అర్థం ఏంటో చూపించాల్సి వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు.






