అందుకే స్టార్ హీరోల పేర్లు బయటపెట్టాలనుకోవడం లేదు.. దీపికా పదుకొణె షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit)తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

అందుకే స్టార్ హీరోల పేర్లు బయటపెట్టాలనుకోవడం లేదు.. దీపికా పదుకొణె షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit)తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone)ను ప్రభాస్ సరసన నటించేందుకు సెలెక్ట్ చేసుకున్నారు. కానీ షూటింగ్ స్టార్ట్ కాకముందే దీపికాను తొలగించి త్రిప్తిని ఫైనల్ చేశాడు. వీరిద్దరి మధ్య పనిగంటల విషయంలో వివాదం తలెత్తడంతో మూవీ స్టోరీ లీక్ చేసినట్లు పీఆర్ టీమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సందీప్ పోస్ట్ పెట్టాడు. ఇక ఆ తర్వాత దీపికాను కల్కి సీక్వెల్ నుంచి కూడా తొలగించారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఒక ఆత్మాభిమానం ఉన్న నటిగా నేను ఇబ్బంది పెట్టే వాటిని అంగీకరించను.

సినీ ఇండస్ట్రీలో చాలామంది సూపర్ స్టార్‌లు, అగ్ర హీరోలు ఎన్నో ఏళ్లుగా 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. ఇదేం రహస్యం కాదు.. కానీ ఇన్నేళ్లలో ఈ విషయం ఎప్పుడూ వార్తల్లో నిలవలేదు. ఇప్పుడు వాళ్ల పేర్లు చెబితే మొత్తం విషయం తప్పుదోవ పడుతుంది. అందుకే వాళ్ల పేర్లు చెప్పాలనుకోవడం లేదు. కానీ నేను ఈ విషయంపై ప్రశ్నిస్తే.. ఎన్నో ప్రచారాలు వచ్చాయి. చాలామంది హీరోలు 8 గంటలే పని చేస్తారని అందరికీ తెలిసిన విషయమే. సోమవారం నుంచి శుక్రవారం వరకే పని చేస్తారు. వారం మొత్తం పని చేయరు. అలాంటి వాళ్ళని ఏమనరు. నేను ఎన్నో పోరాటాలను నిశ్శబ్దంగా ఎదుర్కొన్నాను. ఇదేం కొత్త కాదు. ఏ విషయంపై స్పందించను.. సైలెంట్‌గా యుద్ధాలను చేయడమే నాకు తెలుసు’’ తన ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story