- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుకే చరణ్‌కి నాకు ఆ ప్లేస్ చాలా స్పెషల్ : ఉపాసన
మెగా కోడలు అయినప్పటికి మంచితనంతో సేవగుణంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది

దిశ, సినిమా: మెగా కోడలు అయినప్పటికి మంచితనంతో సేవగుణంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. ఇక తాజాగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 91వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మనవరాలు, చరణ్ అర్ధాంగి ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ముచ్చటించింది.. ‘చరణ్ కి నాకు చెన్నై చాలా స్పెషల్ ప్లేస్. ఎందుకంటే నేను చరణ్ అక్కడె పుట్టాము. అలా ఇద్దరికీ చెన్నై అంటే చాలా ఫేవరెట్. కామినేని కొణిదెల కుటుంబాలపై తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు సైతం అభిమానాన్ని చూపించడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ వెల్లడించింది.
అలాగె ప్రతాప్ సి రెడ్డి జీవితంపై తీసుకువచ్చిన ‘ది అపోలో స్టోరీ’ పుస్తకం గురించి కూడా ఉపాసన ప్రస్తావించింది.. ‘ఎల్లలు లేని కలలు కనే ప్రతి ఆడపిల్లకు, మగ బిడ్డ తో సమానంగా కూతుళ్లకు మద్దతుగా నిలిచే తండ్రులకు ఈ పుస్తకం ఒక భావోద్వేగ నివాళి. ఈ పుస్తకం తీసుకురావడంలో సహకరించిన అమర్ చిత్ర కథ సంస్థకు, రానా దగ్గుబాటికి కృతజ్ఞతలు’ అని తెలిపింది ఉపాసన.






