సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకునేది దాని కోసమే.. నోరా ఫతేహి సంచలన కామెంట్స్!

by Disha Web Desk 6 |
సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకునేది దాని కోసమే.. నోరా ఫతేహి సంచలన కామెంట్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ముందుగా ఐటెం సాంగ్స్‌ చేసి తన స్టెప్పులతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. మరీ ముఖ్యంగా బెల్లీ డ్యాన్స్ చేయడంలో నోరా ఫతేహి ని మించిన వారు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో కూడా ఈ భామ టాలీవుడ్ స్టార్స్ సినిమాలు టెంపర్, బాహుబలి-1 కిక్-2 వంటి సినిమాల్లో కనిపించింది. ఇటీవల మడ్గావ్ అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే కొత్త ప్రాజెక్ట్స్‌ను ఓకే చేస్తుంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నోరా ఫతేహి.. సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు ఫేమ్ కోసమే చేసుకుంటారని సంచలన కామెంట్స్ చేసి తీవ్ర దుమారం రేపింది. ‘‘ ఇండస్ట్రీలోని కొందరు సెలబ్రిటీలు డబ్బు, స్టార్ డమ్ కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమించిన వ్యక్తితో మూడేళ్లు రిలేషన్ కొనసాగించి బాయ్ ఫ్రెండ్‌తో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అవి హిట్ అందుకుంటేనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇష్టం లేకపోయినా సరే వారితోనే జీవిస్తున్నారు. బాలీవుడ్‌లో చాలా మంది అలా చేసే పనికిమాలిన వాళ్లు ఉన్నారు. వారు కేవలం ఆ సర్కిల్‌లో మాత్రమే ఉండాలని కోరుకుంటారు. కెరీర్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు అందుకే వారికి కొంత బ్యాకప్ ప్లాన్ కావాలి కాబట్టి అలా చేస్తున్నారు. ఇండస్ట్రీలో తమ సర్కిల్ పెంచుకోవడానికి ఒకరి ద్వారా మరొకరు అవకాశాలు దక్కించుకోవడానికి మాత్రమే పెళ్లిళ్లు చేసుకుంటారు.

నేను ఇదంతా నా ఇండస్ట్రీలో చూస్తున్నాను. మరి కొంత మంది వార్తల్లో ఉండేందుకు కూడా పెళ్లి చేసుకుంటున్నారు’’ అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఏ కపుల్ గురించి చెబుతుందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వారి పేర్లను చెప్పకుండా అసలు నిజాలు బయటపెట్టింది. అలాగే తనకు బాయ్‌ఫ్రెండ్ లేకపోవడానికి కారణాలు ఏంటో కూడా చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘ చాలా మంది నన్ను వాళ్ల ఫేమ్ కోసం వాడుకుంటున్నారు. అందుకే ఇలాంటి వారిని నాతో ఉండనివ్వడం లేదు. అందుకే నేను అబ్బాయిలతో డేటింగ్ చేయడం మీకు కనిపించడం లేదు’’ అని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం నోరా ఫతేహి కామెంట్స్ నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతున్నారు.

Next Story