ఫేమ్ కోసం నటిమణులు అలా చెబుతారు.. కాస్టింగ్ కౌచ్‌పై రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు!

by Disha Web Desk 6 |
ఫేమ్ కోసం నటిమణులు అలా చెబుతారు.. కాస్టింగ్ కౌచ్‌పై రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ రెజీనా ‘కండనాళ్ మొదల్’ అనే తమిళ సినిమాతో కథానాయికగా పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగులో ‘శివ మనుసులో శృతి’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా పాపులారిటీ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు వెబ్‌సిరీస్‌ల పైన దృష్టి సారిస్తోంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా కాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘నా సినీ కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం కొందరిని సంప్రదించాను. దాంతో ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తానని అడ్జస్ట్‌మెంట్‌కి ఓకే చెబితే తర్వాత వెంటనే షూటింగ్ పని చూసుకోవచ్చన్నారు. ఇది జరిగి ఇప్పటికి సుమారు 10 సంవత్సరాలు అయింది. నా వయసు అప్పుడు కేవలం 20 ఏళ్లు. అతని మాటల పట్ల నాకు సరైన అవగాహన లేదు. అడ్జస్ట్‌మెంట్ అంటే ఏమిటో కూడా తెలియదు. రెమ్యునరేషన్ విషయంలో అడుగుతున్నారో మోనని సరే నా మేనేజర్ నీతో మాట్లాడుతారని ఫోన్ కట్ చేశాను. ఆ తర్వాత మేనేజర్ ద్వారా అసలు విషయం తెలిసింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి అనుభవం ఎదురుకాలేదు. కొందరు నటీమణులు మాత్రం ఇలాంటి ఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని నిజాలు కావొచ్చు. కొంత మంది ఫేమ్ కోసం అబద్ధాలు కూడా చెబుతారు. నిజం ఏమిటో వారికి మాత్రమే తెలుసు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More: మరోసారి పబ్లిక్‌లో రెచ్చిపోయిన బిగ్‌బాస్ జంట.. ముద్దులు పెట్టుకుంటూ నీచంగా

Next Story

Most Viewed