- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం అదే.. ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్‌ను వదిలేయడం వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

దిశ, సినిమా: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra). అమెరికాలోనే స్థిరపడి హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న ఈ గ్లోబల్ బ్యూటీ, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక తన కెరీర్ గురించి మనసు విప్పి మాట్లాడింది. బాలీవుడ్‌ను వదిలేయడం వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘‘నేను బాలీవుడ్‌ను కావాలని వదిలేయలేదు. అక్కడ వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే నా మార్కెట్‌ను విస్తరించుకోవాలని ఆశపడ్డాను. కానీ ఒకానొక దశలో నా కెరీర్ ఒకే చోట ఆగిపోయినట్లు అనిపించింది. నాకు రావాల్సిన అవకాశాలు తగ్గిపోవడం, కావాలని నన్ను పక్కన పెట్టడం నన్ను తొక్కేయాలని చూడటం వంటి కారణాల వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యాను’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనే తనను తాను నిరూపించుకోవడానికి హాలీవుడ్ వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అక్కడ సుస్థిర స్థానం సంపాదించుకున్నానని తెలిపింది. అంతేకాకుండా తాను ఎప్పటికీ ఇండియన్ సినిమాల్లో నటించడానికే ఇష్టపడతానని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






