- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నయనతార రూల్స్ బ్రేక్ చేయడానికి కారణం అదే.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) ఇప్పటివరకు ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటూ వచ్చింది.

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) ఇప్పటివరకు ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. ఒక్కసారిగా తన పద్దతిని మార్చుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా నయన్ సాధారణంగా ప్రమోషన్లకు హాజరుకావడం చాలా అరుదు. కానీ ఈసారి మాత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)మూవీ కోసం షూటింగ్ ప్రారంభం నుంచే విడుదల దాకా యాక్టివ్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు, ఈవెంట్స్.. అన్నింటిలోనూ ఆమె పాల్గొనడం అభిమానులకు ప్రత్యేకంగా కనిపిస్తోంది.
అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కానుంది. ఇందులో మెగాస్టార్‌తో నయన్ రొమాన్స్ చేయనుంది. ఆమె ప్రమోషన్లలో కనిపించడం సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఇక ఇదే విషయంపై సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ మార్పుకు కారణం ఏంటన్నదానిపై తాజాగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. యాంకర్ నయనతార గారిని ప్రమోషన్స్‌కు ఎలా ఒప్పించారు? అని అడగగా.. “నేను ఆమెకి ఒక ఐడియా చెప్పాను. అది ఆమెకి నచ్చింది. నిజాయితీగా నా కోరి తీరాలని అనుకున్నాను జరిగిపోయింది. అడిగే విధానం, చెప్పే ఆలోచన నచ్చితే నయనతార కూడా సపోర్ట్‌గా ఉంటారు’’ అని అన్నారు. అయితే అనిల్ రావిపూడి చెప్పిన ఆ ‘ఐడియా’ ఏంటన్నదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.






