బాలయ్యతో అలా చేస్తేనే అసలైన కిక్ అంటున్న హాట్ బ్యూటీ.. షాకింగ్ కామెంట్స్ వైరల్!

by Mallepaka Hamsa |

బాలయ్యతో గడిపిన ప్రతి క్షణం నాకు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. సెట్‌లో ఆయన ఇచ్చే ఎనర్జీ మామూలుగా ఉండదు

బాలయ్యతో అలా చేస్తేనే అసలైన కిక్ అంటున్న హాట్ బ్యూటీ..  షాకింగ్ కామెంట్స్ వైరల్!
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ గురించి సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పూర్తిగా తిప్పికొట్టారు. ‘డాకు మహారాజ్’ సినిమాలో ఆయన సరసన నటించిన ఊర్వశి, బాలయ్య వ్యక్తిత్వం గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలయ్యను ఒక ‘జెంటల్‌మెన్’గా చెబుతూ ఊర్వశి తన మనసులోని మాటను పంచుకున్నారు. బాలయ్య దూకుడు కేవలం కెమెరా ముందే కాదు.. నిజ జీవితంలో కూడా అలాగే ఉంటుందని అయితే దాని వెనుక ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం దాగి ఉందని ఆమె తెలిపింది. బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్‌తో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని ఊర్వశి గర్వంగా చెబుతున్నారు. "ఆయనతో గడిపిన ప్రతి క్షణం నాకు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. సెట్‌లో ఆయన ఇచ్చే ఎనర్జీ మామూలుగా ఉండదు" అని ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఆయనతో కలిసి యాక్షన్ సీన్లు అంటేనే అసలైన కిక్ అని.. బాలయ్యలో ఉన్న క్రమశిక్షణ తనను ఎంతో ఆకట్టుకుందని ఊర్వశి వివరించారు.

బాలయ్య తన ఫ్యాన్స్‌పై కోప్పడటం లేదా ఫోన్లు విసిరేయడం వంటి ఘటనలపై వస్తున్న విమర్శలకు ఊర్వశి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "బాలయ్య గారు అలా చేస్తుంటే నాకు చాలా సరదాగా అనిపించేది. అది ఆయన సహజ సిద్ధమైన స్వభావం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన ఎవరి మీదైనా కోప్పడితే ఆ అభిమానులు కూడా బాధపడరు, పైగా సంతోషిస్తారు. ఆయన చేసే పనుల వెనుక ఉన్న ప్రేమను వాళ్లు అర్థం చేసుకుంటారు" అని ఊర్వశి పేర్కొన్నారు. బయట వాళ్లు అనుకునే దానికి, సెట్‌లో ఉండే వాతావరణానికి చాలా తేడా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.బాలయ్యకు, తనకు మధ్య ఉన్న స్నేహం గురించి చెబుతూ ఊర్వశి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. గతేడాది వాలెంటైన్స్ డే రోజున తనకు మొదటి విష్ బాలయ్య నుంచే రావడంతో.. ఒక స్టార్ హీరోగా ఉండి కూడా అందరినీ సమానంగా చూసే ఆయన గుణం ఊర్వశిని ఫిదా చేసింది. కేవలం నటనలోనే కాదు, మనుషులను గౌరవించడంలో కూడా బాలయ్య గొప్ప వ్యక్తి అని ఊర్వశి కితాబిచ్చారు. మొత్తానికి ‘డాకు మహారాజ్’ సినిమా షూటింగ్ ఊర్వశికి ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయినట్లు కనిపిస్తోంది.

Next Story