- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు ఇష్టమైన సినిమా అదే.. అలా చేయడం వల్లే అంతగా మెప్పించలేకపోయింది: రవితేజ
మాస్ మహారాజా రవితేజ(raviteja) ‘మాస్ జాతర’(mass jathara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(raviteja) ‘మాస్ జాతర’(mass jathara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో శ్రీలీల(sreeleela) రవితేజ సరసన రొమాన్స్ చేయనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక భాను భోగవరపు(bhanu bhogavarapu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్స్‌లోకి రానుంది. ఇక ఈ చిత్రంతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలోనూ ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు.
తాజాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈగల్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అది నా ఫేవరెట్. అందులో నేను చేసిన పాత్ర నా కెరీర్‌లోనే అత్యంత ఇష్టమైనది. కానీ జనాలకుఅది అర్ధం కాలేదు. కథను సింపుల్‌గా చెప్పి ఉంటే అర్థం అయ్యేది కానీ స్క్రీన్ ప్లే కొంచెం క్లిష్టంగా ఉండటం వల్ల మెప్పించలేకపోయింది. ‘‘నా ఆటోగ్రాఫ్ మెమోరీస్’ కూడా అలాగే జరిగింది. చాలా మంది హృదయాలను గెలుచుకుంది కానీ విజయం సాధించలేదు’’ అని చెప్పుకొచ్చాడు.






