- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ కటౌట్‌కు అది చాలా చిన్న మాట.. ‘ది రాజాసాబ్’ హైప్ పెంచుతున్న మారుతి కామెంట్స్
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruthi), ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab).

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruthi), ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab). హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్‌తో ఈ సెలబ్రేషన్స్‌ను బిగిన్ చేశారు మూవీ టీమ్. ఫస్ట్ సాంగ్ ‘రెబల్ సాబ్’ను రిలీజ్ చేశారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. మీ మొహాల్లో ఈ నవ్వు చూడటం కోసమే కష్టపడుతున్నాం.
మా టీమ్ అంతా పడేది మామూలు కష్టం కాదు. ఈ సినిమాతో పండక్కి మీరంతా కాలర్ ఎగరేసుకుంటారు అని చెప్పను. ఎందుకంటే ఈ సినిమాకు ప్రభాస్ గారి కటౌట్ కు అది చాలా చిన్న మాట. మీ మనసుల్లోకి రెబల్ గాడ్ అని ఎలా వచ్చిందో తెలియదు. కానీ నేనిప్పుడు ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా. చిన్న కాలేజలో చదివేవాడిని, అలాంటిది ఆయన నీకు టాలెంట్ ఉంది రమ్మంటూ తన యూనివర్సిటీలోకి అహ్వానించారు. నాకు అర్హత ఉందో లేదో తెలియదు కానీ ఆయన యూనివర్సిటీలోకి వెళ్లాక ఆయనను అర్థం చేసుకుంటూ ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా. ప్రభాస్ గారి ఫొటో జేబులో ఉంటే ఎలాంటి వాడైనా టాప్ డైరెక్టర్ అయిపోతాడు.
అందులో డౌట్ లేదు. కల్మషం లేని మనస్తత్వం, ప్రేమతోనే అందరినీ దగ్గర చేసుకుంటాడు. రెండేళ్లు ఆయనతో ట్రావెల్ చేస్తున్నానంటే నేను అదృష్టవంతుడిని అనుకుంటా. మీ కేరింతలతో ‘రాజా సాబ్’ థియేటర్స్ మార్మోగుతాయి. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి ఫస్ట్ మనమంతా థ్యాంక్స్ చెప్పాలి. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి పండక్కి ‘రాజా సాబ్’ సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. ప్రభాస్ గారు ఇచ్చిన కంఫర్ట్, ప్రోత్సాహం వల్లే ఇంత బాగా మూవీని రూపొందించగలిగాను. అభిమానులు నాపై పెట్టుకున్న హోప్స్ కు ఒక పర్సెంట్ ఎక్కువే ఇస్తా’’ అన్నారు.






