- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే.. ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతున్నా: లయ
తెలుగు సినీ ప్రేక్షకులకు లయ (laya) అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

దిశ, సినిమా: తెలుగు సినీ ప్రేక్షకులకు లయ (laya) అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పటి స్టార్ హీరోల సరసన నటిస్తూ తన సహజమైన అందం, చక్కని అభినయంతో అభిమానులను ఆకట్టుకున్న హీరోయిన్ ఆమె. గ్లామర్‌కు దూరంగా ఉండి కూడా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం లయకే సాధ్యమైంది. చేసిన సినిమాలు తక్కువే అయినా.. ప్రతి పాత్రలో తనదైన ముద్ర వేసింది. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన లయ, తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని అతి తక్కువ కాలంలోనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. చాలా ఏళ్ల తర్వాత నితిన్ నటించిన తమ్ముడు సినిమాతో మళ్లీ తెరపై కనిపించింది లయ. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపెట్టింది. అరవింద సమేత సినిమాలో వచ్చిన అవకాశాన్ని తానే వదులుకున్నానని, అది ఇప్పటికీ తనను బాధిస్తోందని చెప్పింది. ‘‘ఈ సినిమాలో జగపతి బాబు భార్య పాత్రకు నన్ను సంప్రదించారు.
కానీ అది చిన్న రోల్ అనుకుని తిరస్కరించాను. నిజానికి కథను పూర్తిగా వినకుండానే ఆ నిర్ణయం తీసుకున్నాను. తర్వాత ఆ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌దో అర్థమైంది. అప్పుడే తెలుసుకున్నాను.. నేను పెద్ద తప్పు చేశానని. ఈ విషయంలో ఇప్పటికీ బాధపడుతున్నాను. ఈశ్వరీ రావు గారు ఆ పాత్రను అద్భుతంగా పోషించారు. అయినా, నేను చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అన్న భావన ఇప్పటికీ ఉంది. నా కెరీర్‌లో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. అంతేకాదు, ఇలా కొన్ని హిట్ సినిమాల్లో అవకాశాలను కూడా వదులుకున్నాను’’ అంటూ లయ తన మనసులోని బాధను వెల్లడించింది.






