నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అదే.. అతన్ని కలవకుండా ఉండాల్సిందంటూ అషురెడ్డి ఎమోషనల్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-01 06:53:36  IST  )

ఆ ఒక్క రోజు పని మీద బయటకు వెళ్ళినప్పుడు, నా మాజీ ప్రియుడిని కలవకుండా ఉండి ఉంటే బాగుండేది.

నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అదే.. అతన్ని కలవకుండా ఉండాల్సిందంటూ అషురెడ్డి ఎమోషనల్
X

దిశ, సినిమా: బుల్లితెర నటి, సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి గత కొన్ని రోజులుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన మాజీ ప్రియుడి గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. జబర్ధస్త్ వర్ష హోస్ట్ చేసిన ఒక షోలో పాల్గొన్న అషు రెడ్డి, తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు గురించి బయటపెట్టింది. "ఆ ఒక్క రోజు పని మీద బయటకు వెళ్ళినప్పుడు, నా మాజీ ప్రియుడిని కలవకుండా ఉండి ఉంటే బాగుండేది" అని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. అతడిని కలవడం వల్లే తన జీవితంలో ఇన్ని సమస్యలు వచ్చాయని ఆవేదన చెందింది. ఒక ఇంటర్వ్యూ వల్ల కూడా తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ రోజు తీసుకున్న నిర్ణయం తనను ఇప్పటికీ వేధిస్తోందని చెప్పుకొచ్చింది.

ఈ వివాదాల వల్ల తన కంటే తన తల్లిదండ్రులు ఎక్కువగా బాధపడుతున్నారని అషు ఎమోషనల్ అయ్యింది. "నేను చేసిన తప్పులకు ఎవరైనా నన్ను ఏమైనా అంటే పడతాను. కానీ, అపార్ట్‌మెంట్లలో నా గురించి తప్పుగా మాట్లాడుతుంటే నా తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. వారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు" అని కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇంతకీ ఆ మాజీ ప్రియుడు ఎవరు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్ర వద్ద రూ. 9.35 కోట్లు తీసుకుని మోసం చేసిందనే ఆరోపణలపై అషు రెడ్డి ఇప్పటికే స్పందించింది. తన పరువుకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేయకూడదని ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఆమె వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే కథనాలను ప్రసారం చేయవద్దని మీడియాకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు కోర్టు గొడవలు, ఇటు వ్యక్తిగత జీవితంలోని బాధలతో అషు రెడ్డి ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.

Similar News :

అషురెడ్డి కేసు.. హైర్టు కీలక ఆదేశాలు

Next Story