- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అషురెడ్డి కేసు.. హైర్టు కీలక ఆదేశాలు
టాలీవుడ్ నటి, యాంకర్ అషురెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అషు హైదరాబాద్ కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిందన్న ఆరోపణలతో సీసీఎస్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి, యాంకర్ అషురెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అషు హైదరాబాద్ కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిందన్న ఆరోపణలతో సీసీఎస్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై అషురెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విషయంలో మీడియాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అషురెడ్డి గురించి అవమానకర, అవాస్తవ కథనాలను ప్రసారం చేయకూడదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా సంస్థలు, కంటంట్ క్రియేటర్లు సోషల్ మీడియాలో అషురెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి పరువునష్టం కలిగించే అంశాలను ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అప్ లోడ్ చేసిన వివాదాస్పద కంటెంట్ కూడా తొలగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఉల్లంగిచే వారిపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
కోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీని అషు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కోర్టు ఆదేశాలను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపింది. తన ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను, నెటిజన్లను కోరింది. ప్రస్తుతం విషయం కోర్టు పరిధిలో ఉందని, ఇప్పటికే తనపై ఎన్నో ఆరోపణలు చేశారని పేర్కొంది. ఆ అభ్యంతకర పోస్టులను తొలగించాలని, కొత్తవి ప్రచురించకుండా సహకరించాలని ఆశిస్తున్నట్టు తెలిపింది. తనకు సపోర్ట్ చేస్తున్నవారికి థాంక్స్ చెబుతూ నిబంధనలు పాటించనివాళ్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇక ఆరోపణలు వచ్చిన తరవాత అషురెడ్డి వాటిపై స్పందించకుండా మొదటి నుండి మీడియాకు వార్నింగ్ ఇవ్వడం ఆశ్చర్యకరం.






