ఆ స్టార్ హీరో నాతో అలా ప్రవర్తించాడు.. సంచలన విషయాన్ని బయటపెడుతూ తమన్నా ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది.

ఆ స్టార్ హీరో  నాతో అలా ప్రవర్తించాడు.. సంచలన విషయాన్ని బయటపెడుతూ తమన్నా ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇటీవల ఆమె ‘ఓదెల-2’ (Odela-2)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ హిట్ అందుకోలేక పోయింది. అయినప్పటికీ హిట్, ఫ్లాప్ గురించి ఆలోచించకుండా వచ్చిన అవకాశాలన్నీ ఒకే చేస్తోంది. అలాగే నిత్యం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సెన్సేషనల్ కామెంట్స్‌తో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. తాజాగా, తమన్నా భాటియా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది.

‘‘నేను చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. అప్పట్లో కొందరు నా నమ్మకాన్ని దెబ్బతీయాలని చూశారు. అవమానించడానికి కూడా ప్రయత్నించారు. కొద్దికాలంలోనే ఓ పెద్ద సౌత్ స్టార్ సరసన నటించే చాన్స్ వచ్చింది. దీంతో నటించడానికి సైన్ చేశాను. కొన్ని సీన్స్ కూడా చేశా.. కానీ అతనితో అసౌకర్యంగా అనిపించింది. వెంటనే దర్శకనిర్మాతలకు నేను చేయలేను అని చెప్పేశా. దీంతో ఆ స్టార్ హీరో కోసం తెచ్చుకుని హీరోయిన్‌ను మార్చండి అని నా ముందు కేకలు వేశారు.

సెట్‌లో అందరి ముందు పెద్దగా నాపై అరిచాడు. అయినప్పటికీ నేను మౌనంగా ఉన్నాను. మరుసటి రోజు తనంతటతానే నా వద్దకు వచ్చి కోపంలో అలా ప్రవర్తించానిన క్షమాపణలు చెప్పాడు’’ అని చెప్పుకొచ్చింది. కానీ స్టార్ హీరో పేరును మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆ స్టార్ ఎవరో అని తెలుసుకునేందుకు సెర్చింగ్ మొదలెట్టారు.

Next Story