- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anupama Parameswaran: ‘పరదా’ థర్డ్ సింగిల్ అప్డేట్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

దిశ, సినిమా: మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘శతమానం భవతి’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో అమ్మడు రేంజ్ మారిపోయి వరుస అవకాశాలు వచ్చాయి. అలా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి క్రేజీ బ్యూటీగా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ అమ్మడు నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘పరదా’(Paradha ).
ఇందులో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు మలయాళ హీరోయిన్ దర్శన రాజేంద్రన్(Darshana Rajendran), సీనియర్ నటి సంగీత కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీకి ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula)దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆనంద్ మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి. శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్‌ను విడుదల చేస్తున్నారు.
తాజాగా, ‘పరదా’ అప్డేట్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన థర్డ్ పాట ‘ఎగరేయి నీ రెక్కలే’ లిరికల్ వీడియో ఆగస్టు 5న సాయంత్రం 5 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ పోస్ట్‌కు ‘‘ఈ సంగీత మాయాజాలం ద్వారా జీవితపు ఒక ఆత్మీయ ప్రయాణం’’ అని రాసుకొచ్చారు. కాగా, సోషియో డ్రామాగా కాన్సెప్ట్‌తో రాబోతున్న ‘పరదా’ పాన్ ఇండియా రేంజ్‌లో ఆగస్టు 22న థియేటర్స్‌లోకి రాబోతుంది.






