ఆ సంతృప్తి చాలా గొప్పది.. హాట్ ఫొటోలు షేర్ చేయడంపై బిగ్‌బాస్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

బిగ్‌బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న వారిలో ఇనాయా సుల్తానా(Inaya Sultana) ఒకరు.

ఆ సంతృప్తి చాలా గొప్పది.. హాట్ ఫొటోలు షేర్ చేయడంపై బిగ్‌బాస్ బ్యూటీ సెన్సేషనల్  కామెంట్స్
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న వారిలో ఇనాయా సుల్తానా(Inaya Sultana) ఒకరు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చేసిన ఈ భామకు ఊహించని విధంగా ఫేమ్ రావడంతో సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేసి మరింత ఫాలోయింగ్‌ను రాబట్టుకుంది. అంతేకాకుండా పలు షోస్‌లో పాల్గొన్న ఆమె పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సమయంలోనూ గౌతమ్ (Gautam)అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలంపాటు.. ప్రేమలో ఫుల్ ఎంజాయ్ చేసిన ఇనాయా సుల్తానాపై ఊహించని దెబ్బ పడింది. బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో బ్రేకప్ చెప్పేశాడు.

దీంతో కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటున్న ఇనాయా ఆ బాధను తట్టుకోలేకపోతుంది. నిత్యం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన బాధను వ్యక్త పరుస్తోంది. అలాగే తాను నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలు షేర్ చేయడానికి కారణం ఏంటో కూడా చెప్పింది. నేను డిప్రెషన్‌‌ను అధిగమించడానికి కొత్త విషయాలను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. జిమ్ నా జీవితంలో ఉన్న ఒకే ఒక సంతోషానిచ్చే పని. డబ్బుతో ప్రపంచంలో ఏదైనా కొనవచ్చు.. కానీ శరీరాన్ని కొనలేమని, మార్చలేమని చెప్పింది. జిమ్‌లో కష్టపడి శరీరాన్ని మార్చుకోవడం వల్ల లభించే సంతృప్తి చాలా గొప్పది. అందుకే నేను నిత్యం జిమ్ ఫొటోలు షేర్ చేస్తానని పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి. ఈ విషయంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. నీలాంటి వాళ్ల గురించే శివాజీ చెప్పిందని ఇప్పటికైనా మారాలని సలహాలు ఇస్తున్నారు.

Next Story