- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పాత్ర నాకు సవాలుగా మారింది.. చాలా కష్టపడి చేశాను: వేదిక
ప్రస్తుతం నేను రెండు సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. అందులో ఒకటి భయపెట్టే హారర్ సినిమా కాగా, మరొకటి అద్భుతమైన ఫాంటసీ కథాంశంతో సాగుతుంది.

దిశ, సినిమా: గత ఇరవై ఏళ్లుగా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి వేదిక. ‘మదరాసి’ అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అందాల భామ, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇటీవల ‘ఆడు-3’ అనే మలయాళ చిత్రంతో పలకరించిన వేదిక, తాజాగా తన రాబోయే సినిమాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. వేదిక ప్రస్తుతం రెండు భారీ తమిళ ప్రాజెక్టులలో నటిస్తోంది. "ప్రస్తుతం నేను రెండు సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. అందులో ఒకటి భయపెట్టే హారర్ సినిమా కాగా, మరొకటి అద్భుతమైన ఫాంటసీ కథాంశంతో సాగుతుంది. ఈ రెండు చిత్రాల షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది" అని వెల్లడించింది.
అయితే ఆ సినిమాల పేర్లను మాత్రం ఆమె బయటపెట్టలేదు. ముఖ్యంగా, ఈ సినిమాల్లో తను చేస్తున్న ఒక పాత్ర తనను చాలా కష్టపెట్టిందని వేదిక చెప్పుకొచ్చింది. "ఆ పాత్ర కోసం నేను మునుపెన్నడూ లేనంతగా శ్రమించాను. నా పరిమితులను దాటి ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ప్రయత్నించాను. ఇది నా కెరీర్‌లోనే ఒక మొట్టమొదటి విభిన్నమైన అనుభవం. సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు ఆ పాత్ర కోసం నేను పడ్డ కష్టం ప్రేక్షకులకు స్పష్టంగా కనిపిస్తుంది" అని ఆమె ఎంతో నమ్మకంగా తెలిపింది. సాధారణంగా సినిమాల్లో అందంగా కనిపించే వేదిక, ఇప్పుడు ఇలా తన నటనకు సవాలు విసిరే పాత్రలను ఎంచుకోవడం చూస్తుంటే, హిట్ కోసం చాలా పకడ్బందీ వేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ రెండు సినిమాలు ఏమిటి? ఆమె అంతగా కష్టపడిన ఆ విభిన్నమైన పాత్ర ఎలా ఉండబోతోంది? అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






