- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమా ఫ్లాప్ కావడంతో నా కెరీర్ కష్టాల్లోకి వెళ్లింది.. వైరల్‌గా మారిన కియారా కామెంట్స్
కియారా అద్వానీ మాట్లాడుతూ… తన మొదటి సినిమా ‘ఫుగ్లీ’ ఫ్లాప్ కావడంతో చాలా కష్టాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి కియారా అద్వానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ… తన మొదటి సినిమా ‘ఫుగ్లీ’ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక ఫ్లాప్ అయ్యింది. దాంతో ఆ చిత్రం ద్వారా నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. మొదటి సినిమా విడుదల తర్వాత కూడా తనకు అనేక కష్టాలు ఎదురయ్యాయని, ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లినప్పటికీ చాలామంది తనను రిజెక్ట్ చేశారని కియారా వెల్లడించింది.
అయితే ఆ తర్వాత ‘ఎం.ఎస్. ధోని’ మరియు ‘కబీర్ సింగ్’ సినిమాలతో మంచి గుర్తింపు వచ్చిందని, ఆ రెండు చిత్రాలు విజయం సాధించినప్పటికీ ఇండస్ట్రీలో ఇంకా కొన్ని సవాళ్లు ఎదురయ్యాయని తెలిపింది. వాటిని అధిగమించి ప్రస్తుతం మంచి స్థాయిలో కెరీర్‌ను కొనసాగిస్తున్నానని చెప్పింది. జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్టాలు వస్తాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడితేనే విజయం సాధ్యమవుతుందని కియారా పేర్కొంది. ప్రస్తుతం ఆమె ‘టాక్సిక్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో యష్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.






