ఆ బాధ వర్ణణాతీతం అంటూ బోరున ఏడుస్తున్న వీడియో షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-22 17:03:55  IST  )

నేను నా సోను బాయ్‌ని కోల్పోయాను. ఈ బాధను వర్ణించలేను. దానికి కిడ్నీ ఫెయిల్యూర్ ఉండేది, కానీ ఎటువంటి లక్షణాలు కనిపించలేదు.

ఆ బాధ వర్ణణాతీతం అంటూ బోరున ఏడుస్తున్న వీడియో షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న వారిలో అశ్విని శ్రీ ఒకరు. ఈ అమ్మడు బిగ్‌బాస్-7వ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టి తన టాలెంట్‌తో హౌస్‌లో అలరించింది కానీ విన్నర్ కాలేకపోయింది. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి సినిమాల్లో అవకాశాలు రాబట్టుకుంటూ తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, అశ్విని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ.. ఎమోషనల్ అయిపోయింది. తాను ఎంతగానో ప్రేమించే తన పెట్ డాగ్ మరణించినట్లు తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేసింది.

‘‘నేను నా సోను బాయ్‌ని కోల్పోయాను. ఈ బాధను వర్ణించలేను. దానికి కిడ్నీ ఫెయిల్యూర్ ఉండేది, కానీ ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. దయచేసి, మీకు కుక్క ఉంటే.. క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకండి. దానికి ఏదైనా సమస్య ఉన్నప్పుడు అవి మనకు చెప్పలేవు. బయటకు సాధారణంగా కనిపించేది లోపల తీవ్రమైన సమస్య కావచ్చు. ముందస్తు పరీక్షలు వాటి ప్రాణాలను కాపాడగలవు. దానికి మరో అవకాశం దొరికితే నేను ఏదైనా చేస్తాను. దయచేసి, మరీ ఆలస్యం చేయకండి’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా తన పెట్ డాగ్ ప్రాణాలతో ఉన్నప్పటి వీడియోని షేర్ చేసి ఏడుస్తూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు అశ్వినికి ధైర్యం చెబుతున్నారు.

ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు.. అది నిజం కావడం దురదృష్టకరం: Mamitha Baiju

Next Story