- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఒక్క క్షణం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది: శ్రద్ధాదాస్
టాలీవుడ్ నటి శ్రద్ధాదాస్(Shraddha Das) నటిగా, ఐటమ్ గర్ల్‌గా ప్రేక్షకులను మెప్పించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ నటి శ్రద్ధాదాస్(Shraddha Das) నటిగా, ఐటమ్ గర్ల్‌గా ప్రేక్షకులను మెప్పించింది. ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించిన ఈ భామకు ప్రస్తుతం అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో అడపా దడపా చిత్రాల్లో నటిస్తూ.. ఇండస్ట్రీలో రాణిస్తోంది. తెలుగులో మాత్రం చివరగా ‘గరుడవేగ’(PSV Garuda Vega)లో కనిపించింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణం గురించి భావోద్వేగంగా మాట్లాడింది. కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఒక చిన్న అవకాశం ఎలా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందో ఆమె వివరించింది. ‘‘అల్లు అర్జున్(Allu Arjun)తో కలిసి పనిచేయాలన్న కోరిక నా మనసులో చాలా ఏళ్ల నుంచి ఉంది. హైదరాబాద్‌లో ఉన్న రోజులలో ఆయన పోస్టర్‌ను చూసి, “ఏదో ఒక రోజు తప్పకుండా ఆయనతో కలిసి పని చేస్తాను” అని మనసులో అనుకున్నా. ఆ సమయంలో అది ఒక కలలా అనిపించినా, అదే కల కొద్ది గంటల్లో నిజమవడం తన జీవితంలో మర్చిపోలేని మలుపుగా మారింది.
నేను హైదరాబాద్ నుంచి విమానాశ్రయానికి కూడా చేరుకోకముందే ‘ఆర్య 2’ సినిమా నుంచి కాల్ వచ్చింది. ఆ ఒక్క ఫోన్ కాల్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం రావడంతో నా కెరీర్ ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగింది. ‘ఆర్య 2’ (Arya 2)తర్వాత నాకు వరుసగా అవకాశాలు వచ్చాయి.. అలా ఏకంగా 13 సినిమాల్లో నటించే అవకాశం లభించింది. కానీ ఆ ఒక్క ప్రాజెక్ట్ నా జీవిత దిశను మార్చి, నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టింది. అల్లు అర్జున్‌తో కలిసి పని చేయడం నాకు గొప్ప గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నా. ఆయనతో పనిచేసిన అనుభవం ఎంతో ప్రేరణనిచ్చింది.. నటిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించింది. ఒక చిన్న కల ఎలా పెద్ద అవకాశాలకు దారి తీస్తుందో నా జీవితమే ఉదాహరణ’’ అంటూ భావోద్వేగానికి గురైంది. ఇక ఈ విషయంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఎంత అయినా ఐకాన్ స్టార్‌తో నటించడం గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.






